Software Engineer Bhavya Sri Reached Home Safely

Police didn't reveal what was the issue and why she left the home. And whether she is wantedly left the home or any kidnap etc yet to know. However she is safe and alive. Bhavya Sri's family and friends are happy now.
హైదరాబాద్ లో అదృశ్యమైన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ భవ్యశ్రీ చరిత ఆచూకీ ఎట్టకేలకు లభించింది. ఆమె వైజాగ్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసు ప్రత్యేక బృందాలు భవ్యశ్రీని హైదరాబాద్ తీసుకువచ్చారు. ఆదివారం మధ్యాహ్నం ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు. రిలీఫ్ కోసమే తాను విశాఖ వెళ్లినట్లు భవ్యశ్రీ చెప్పారు.
కూకట్ పల్లిలో నివాసం ఉంటున్న భవ్యశ్రీ ఈ నెల 9న అదృశ్యమైన సంగతి తెలిసిందే. గురువారం ఉదయం ఆమె క్యాబ్ లో డ్యూటీకి బయలుదేరి వెళ్లారు. ఆ తర్వాత ఆమె ఇంటికి తిరిగి రాలేదు. తన భార్య కనిపించడంలేదంటూ భవ్యశ్రీ భర్త కార్తీక్ చైతన్య కూకట్ పల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆమె ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మొబైల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. చివరకు విశాఖలో ఉన్నట్లు తెలుసుకొని, అక్కడకు వెళ్లి ఆమెను ఇక్కడకు తీసుకువచ్చారు.
Comments
Post a Comment