Sirasani Soujanya CTS Software Engineer Death News
Sowjanya from Vijayawada working as Software Engineer died, this is a mistory death. విజయవాడ : కృష్ణాజిల్లా విజయవాడలో సౌజన్య అనే నవ వధువు అనుమానాస్పద మృతికి సంబంధించి తాజా వివరాలు వెలుగులోకి వచ్చాయి. అజిత్ సింగ్ నగర్ లోటస్ ల్యాండ్ మార్క్ లోని అపార్ట్‌మెంట్ నుంచి ఆమె కిందకు పడుతున్న సీసీ కెమెరా పుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే సౌజన్య ఆత్మహత్యకు ఒడిగట్టిందా? లేక ఎవరైనా కిందకు తోసేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈనెల 27న సౌజన్య మృతదేహం రోడ్డుపై పడి ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించిన విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళితే రైల్వేలో సీనియర్ సెక్షన్ ఇంజనీర్ గా పనిచేస్తున్న వెంకటేశ్వరరావు రెండో కుమార్తె సౌజన్యకు ఈ నెల 20వ తేదీన వివాహం జరిగింది. సాప్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న ఆమెకు కృష్ణలంకకు చెందిన దిలీప్ అనే సాప్ట్ వేర్ ఇంజనీర్ తో వివాహం అయింది. దంపతులు ఇద్దరూ హైదరాబాద్ లోనే కాపురం పెట్టారు. వారం రోజుల పాటు భర్తతో కలిసి పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్లి వచ్చింది. కాగా ఈ నెల 27వ తేదీన భర్తతో కలిసి హైదరాబాద్ కు వెళ్లాల్స...